మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ సీనియర్ నాయకులు అంబటి రాంబాబుపై టీడీపీ గుండాలు హత్యాయత్నం చేశారని వైఎస్సార్‌సీపీ మహిళా జిల్లా అధ్యక్షురాలు కోడె విజయలక్ష్మి తీవ్రంగా ఖండించారు. భీమవరంలో ఆదివారం ఆమె మాట్లాడుతూ, కూటమి పాలనలో శాంతిభద్రతలు పూర్తిగా విఫలమయ్యాయని, దుర్మార్గాలను ప్రశ్నిస్తే హత్యాయత్నాలు, దాడులు చేస్తున్నారని విమర్శించారు. తిరుమల లడ్డు ప్రసాదంలో కుట్రలు విఫలం కావడంతో వైఎస్సార్‌సీపీ నాయకులపై దాడులు చేయడం దారుణమని ఆమె అన్నారు.