పశ్చిమగోదావరి జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి ఆదేశాల మేరకు, మహిళలు, చిన్నారుల భద్రతకు ప్రాధాన్యతనిస్తూ జిల్లా పోలీసు యంత్రాంగం ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. జూన్ 13, శనివారం నాడు 'శక్తి టీమ్స్' ఆధ్వర్యంలో తణుకు ఆర్టీసీ బస్ స్టాండ్, పెద తాడేపల్లి గ్రామం, పెంటపాడు హై స్కూల్ నందు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. మహిళలకు ఎదురయ్యే భద్రతా సవాళ్లను అధిగమించే మార్గాలను అధికారులు వివరించారు.