జనవరి 31న నిర్వహించనున్న డీఆర్‌సీ సమావేశానికి అన్ని అంశాలతో సంబంధిత అధికారులు సిద్ధంగా ఉండాలని కలెక్టర్ చదవడం నాగరాణి ఆదేశించారు. భీమవరం కలెక్టరేట్లో గురువారం జరిగిన సమీక్ష సమావేశంలో జేసీ రాహుల్ కుమార్ రెడ్డి, డీఆర్‌వో శివన్నారాయణ రెడ్డి పాల్గొన్నారు. జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఈ సమావేశంలో పాల్గొంటారని కలెక్టర్ తెలిపారు.