భీమవరం ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబు, పేదల ఆరోగ్య రక్షణకు ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. భీమవరం ఎమ్మెల్యే కార్యాలయంలో 32 మంది లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ కింద రూ. 17,63,142 విలువైన చెక్కులను ఆయన అందించారు. రాష్ట్ర ప్రభుత్వం బడుగు, బలహీన వర్గాల సంక్షేమం, ఆరోగ్యం పట్ల పూర్తి భరోసా కల్పిస్తోందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.