పశ్చిమగోదావరి జిల్లా శాసనమండలి ఛైర్మన్ కొయ్యే మోషేన్ రాజు కుమారుడు, ఐపీఎస్ అధికారి చిట్టిరాజు వివాహ వేడుకకు మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గురువారం హాజరయ్యారు. పెదఅమిరం శ్రీ రాధాకృష్ణ కన్వెన్షన్ హాల్‌లో జరిగిన ఈ వేడుకలో నూతన వధూవరులు తేజ రిషిత, చిట్టిరాజులకు జగన్ శుభాకాంక్షలు తెలిపి ఆశీర్వదించారు. ఈ సందర్భంగా వైసీపీ నాయకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు.