భీమవరం మండలంలోని అన్ని గ్రామాల్లో 2028 నాటికి మంచినీటి సమస్య ఉండదని, స్వచ్ఛమైన నీటిని అందిస్తామని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు తెలిపారు. తుందుర్రు గ్రామంలో రూ. 62.71 లక్షల అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు. ఇందులో రూ. 36.21 లక్షల జలజీవన్ మిషన్ నిధులతో మైక్రో ఫిల్టర్, రూ. 10.50 లక్షలతో సీసీ డ్రైన్ నిర్మాణం చేపట్టారు.