బైక్-లారీ ఢీ: ఒకరికి తీవ్ర గాయాలు, డ్రైవర్ పరారీ

2చూసినవారు
బైక్-లారీ ఢీ: ఒకరికి తీవ్ర గాయాలు, డ్రైవర్ పరారీ
పశ్చిమ గోదావరి జిల్లా, వీరవాసరం మండలం మత్స్యపురి గ్రామంలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మత్స్యపురి బ్రాందీ షాపు సమీపంలో అతివేగంగా వచ్చిన బైక్ ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ నుజ్జునుజ్జు కాగా, లారీ డ్రైవర్ పరారయ్యాడు. గాయపడిన వ్యక్తి బొబ్బనపల్లి గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. అతని పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.