ఆదిత్య డిగ్రీ కాలేజ్ లో క్యాంపస్ గార్డెన్ శుభ్రత కార్యక్రమం

362చూసినవారు
ఆదిత్య డిగ్రీ కాలేజ్ లో క్యాంపస్ గార్డెన్ శుభ్రత కార్యక్రమం
శ్రీ ఆదిత్య డిగ్రీ కాలేజ్, భీమవరం లోని ఎన్‌ఎస్‌ఎస్ యూనిట్–1 మరియు యూనిట్–2 ఆధ్వర్యంలో క్యాంపస్ గార్డెన్ శుభ్రత కార్యక్రమం విజయవంతంగా నిర్వహించబడింది. ప్రిన్సిపాల్ శ్రీమతి ఏ. అనురాధ, వైస్ ప్రిన్సిపాల్ బి. మావుల్లు, ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ బ్రహ్మం విద్యార్థులను ప్రోత్సహించారు. క్యాంపస్ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం, పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరి బాధ్యత ముఖ్యమని వారు పేర్కొన్నారు. ఎన్‌ఎస్‌ఎస్ వాలంటీర్లు ఉత్సాహంగా పాల్గొని స్వచ్ఛతపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమం విద్యార్థుల్లో సామాజిక బాధ్యతాభావాన్ని పెంపొందించింది.

సంబంధిత పోస్ట్