సీఎం చంద్రబాబు చేతుల మీదుగా భీమవరం కళ్యాణ బ్రహ్మోత్సవాల బ్రోచర్ ఆవిష్కరణ

553చూసినవారు
సీఎం చంద్రబాబు చేతుల మీదుగా భీమవరం కళ్యాణ బ్రహ్మోత్సవాల బ్రోచర్ ఆవిష్కరణ
అమరావతిలోని ముఖ్యమంత్రి కార్యాలయంలో, సీఎం చంద్రబాబు భీమవరం హౌసింగ్ బోర్డు కాలనీలోని శ్రీపద్మావతి సమేత వేంకటేశ్వర స్వామి వారి 15వ వార్షిక కళ్యాణ బ్రహ్మోత్సవాల బ్రోచర్‌ను ఆవిష్కరించారు. రాష్ట్ర మంత్రులు కొండపల్లి శ్రీనివాస్, నిమ్మల రామానాయుడు, ఆలయ అధ్యక్షులు కంతేటి వెంకటరాజు, పెన్నాడ శ్రీను, సింగపూర్ అప్పన్న సీఎంను కలిసి ఈనెల 11వ తేదీ నుంచి 18వ తేదీ వరకు జరిగే బ్రహ్మోత్సవాల వివరాలను తెలియజేసి, భీమవరం వెంకటేశ్వర స్వామి వారి ఆలయాన్ని సందర్శించాలని కోరారు. దీనిపై సీఎం చంద్రబాబు మాట్లాడుతూ గతంలో కూడా మీరు చెప్పడం జరిగిందని, తప్పకుండా భీమవరం వస్తానని హామీ ఇచ్చారు. ఈనెల 11 నుండి 18 వరకు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి.

సంబంధిత పోస్ట్