జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి భీమవరం వీరమ్మ పార్క్ రోడ్డులోని పట్టణ నిరాశ్రయుల వసతి గృహాన్ని ఆకస్మికంగా సందర్శించారు. అక్కడ నివసిస్తున్న నిరాశ్రయులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. వృద్ధుల సంరక్షణకు ప్రత్యేక శ్రద్ధ, ప్రతి నెలా మెడికల్ క్యాంపులు, వంట షెడ్డు, బాత్రూంలు, ఫ్లోరింగ్, ర్యాంపు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఎన్జీవోల సహకారంతో ఆశ్రమ నిర్వహణను ఆమె అభినందించారు. ఈ సందర్శన ద్వారా మౌలిక వసతుల మెరుగుదలకు తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు.