ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియలో భాగంగా ఎన్రోల్మెంట్ ఫారాల డిజిటలైజేషన్, ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ టి. రాహుల్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. నరసాపురం మండల తహసీల్దార్ కార్యాలయంలో జరుగుతున్న ప్రక్రియను పరిశీలించిన ఆయన, మ్యాపింగ్, డిజిటలైజేషన్ పనుల పురోగతిని బూత్ స్థాయి అధికారులను (బీఎల్‌వోలు) అడిగి తెలుసుకున్నారు. 2002 ఓటర్ల జాబితాతో సరిపోల్చి మ్యాపింగ్ ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని సూచించారు.