సీఎంఆర్ డెలివరీలో జాప్యానికి తావివ్వొద్దు.. జేసీ

1093చూసినవారు
జిల్లా జాయింట్ కలెక్టర్ టి. రాహుల్ కుమార్ రెడ్డి రైస్ మిల్లర్లకు ఆదివారం కీలక సూచనలు చేశారు. ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యాన్ని సకాలంలో మిల్లింగ్ చేసి, కస్టమ్ మిల్డ్ రైస్ (సీఎంఆర్)ను నిర్దేశిత గడువులోగా ప్రభుత్వానికి అప్పగించడం ప్రతి రైస్ మిల్లర్ బాధ్యత అని ఆయన అన్నారు. తాడేరు గ్రామంలోని శ్రీ సాయిరాం ఎంటర్‌ప్రైజెస్ రైస్ మిల్లును ఆకస్మికంగా తనిఖీ చేసిన ఆయన, మిల్లింగ్ ప్రక్రియ, బియ్యం నాణ్యత, నిల్వలు, సీఎంఆర్ సరఫరా ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు, మిల్లర్‌కు సూచనలు చేశారు.

సంబంధిత పోస్ట్