డ్రోన్ టెక్నాలజీతో పనులు సులభతరం: మంత్రి కొల్లు రవీంద్ర

258చూసినవారు
డ్రోన్ టెక్నాలజీతో పనులు సులభతరం: మంత్రి కొల్లు రవీంద్ర
రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర, డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామ కృష్ణంరాజు సోమవారం భీమవరంలో డ్రోన్ ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌ను ప్రారంభించారు. డ్రోన్ టెక్నాలజీ అన్ని రంగాల్లోకి విస్తరిస్తోందని, విద్య, వైద్యం, వ్యవసాయం, రక్షణ, చిత్రీకరణలు, పర్యావరణ విపత్తుల్లో సాయానికి కీలక సేవలు అందిస్తోందని వారు తెలిపారు. ఈ సాంకేతికతతో పనులు సులభతరం అవుతాయని వారు అభిప్రాయపడ్డారు. సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ముదునూరి కిరణ్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్