ప్రభుత్వ నీటి వనరులు, చెరువు భూములపై ఆక్రమణలు తొలగించాలి

655చూసినవారు
ప్రభుత్వ నీటి వనరులు, చెరువు భూములపై ఆక్రమణలు తొలగించాలి
పశ్చిమగోదావరి జిల్లాలో ప్రభుత్వ నీటి వనరులు, చెరువు భూములపై జరిగిన ఆక్రమణలను వేగంగా తొలగించాలని, భవిష్యత్తులో పునరాక్రమణలు జరగకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని జిల్లా జాయింట్ కలెక్టర్ టి. రాహుల్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. జిల్లా జాయింట్ కలెక్టర్ ఛాంబర్ నుంచి శనివారం తహసీల్దార్లు, ఎంపీడీవోలు, డిప్యూటీ ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు, జలవనరుల శాఖ అధికారులతో వాచ్‌డాగ్ కమిటీ సమావేశం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించి సమీక్షించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్