చిన అమిరంలో రైతు సమాచార కేంద్రానికి శంకుస్థాపన

2చూసినవారు
చిన అమిరంలో రైతు సమాచార కేంద్రానికి శంకుస్థాపన
భీమవరం మండలం చిన అమిరం గ్రామంలో రైతు సమాచార కేంద్రం, డిజిటల్ లైబ్రరీ నూతన భవన నిర్మాణానికి ఆదివారం శాసనసభ డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామకృష్ణ రాజు, రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఛైర్మన్, భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులుతో కలిసి శంకుస్థాపన చేశారు. P4 మోడల్ లో నిర్మించబోయే ఈ భవనానికి తన వంతుగా రూ. 1,00,116 విరాళం అందిస్తున్నట్లు డిప్యూటీ స్పీకర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రభుత్వ అధికారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్