భీమవరంలో గరికిపాటి రాజారావు జయంతి కార్యక్రమం

208చూసినవారు
భీమవరంలో గురువారం తెలుగు సినిమా దర్శకుడు, గరికపాటి రాజారావు, బుర్రకథ పితామహుడు షేక్ నాజర్ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజా నాట్య మండలి జిల్లా అధ్యక్షులు సీతారామ్, ఉపాధ్యక్షులు భాషా మాట్లాడుతూ, గరికపాటి రాజారావు ప్రజా కళాకారుల గుండెల్లో సదా చిరంజీవి అని, ఎంతో మంది కళాకారులకు రంగస్థలం జీవితాన్నిచ్చిన కళా ప్రపూర్ణుడని కొనియాడారు. బుర్రకథ అనగానే తెలుగువారికి స్మరించదగ్గ మహనీయ కళాకారుడు నాజర్‌ అని అన్నారు.

సంబంధిత పోస్ట్