అమరావతికి జగనే నిబద్ధత: వడ్డి రఘురామ్

1253చూసినవారు
అమరావతికి జగనే నిబద్ధత: వడ్డి రఘురామ్
తాడేపల్లిగూడెం వైసీపీ కార్యాలయంలో మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో నియోజకవర్గ కో ఆర్డినేటర్ వడ్డి రఘురామ్ నాయుడు మాట్లాడుతూ, అమరావతికి జగన్మోహన్ రెడ్డి మాత్రమే నిబద్ధతతో ఉన్నారని అన్నారు. చంద్రబాబు అమరావతిలో ఇల్లు కడుతున్నారని, అయితే జగన్మోహన్ రెడ్డి అప్పుడే అక్కడ ఇల్లు కట్టారని తెలిపారు. గతంలో మూడు రాజధానుల ప్రతిపాదనపై పెద్ద గొడవ చేశారని, అమరావతి రైతుల త్యాగానికి చంద్రబాబు ఏం చేశారని ఆయన ప్రశ్నించారు.

సంబంధిత పోస్ట్