YCP అధినేత జగన్ గురువారం భీమవరంలో పర్యటించనున్నారు. శాసనమండలి ఛైర్మన్ మోషేన్ రాజు కుమారుడు చిట్టిరాజు వివాహ వేడుకకు ఆయన హాజరవుతారు. ఉదయం 11.25 గంటలకు పెద అమిరం చేరుకొని నూతన వధూవరులను ఆశీర్వదిస్తారు. అనంతరం 11.55 గంటలకు తిరుగు ప్రయాణమవుతారు. బుధవారం YCP జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాద్ రాజు, ఇన్‌ఛార్జ్ వెంకట్రాయుడు హెలిప్యాడ్ ఏర్పాట్లను పరిశీలించారు.