భీమవరం కేజీఆర్‌ఎల్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ పూర్వ విద్యార్థిని, అధ్యాపకురాలు మరపట్ల షైనీ ఆంధ్ర విశ్వవిద్యాలయం ఫార్మాస్యూటికల్ సైన్సెస్ విభాగంలో డాక్టరేట్ (పీహెచ్‌డీ) పట్టా పొందారు. 'కొత్త ఐసాటిన్ లింక్డ్ చల్కోన్లు వాటి పైరజోల్ ఉత్పన్నాల సంశ్లేషణ, లక్షణ నిర్ధారణ, జీవక్రియల మూల్యాంకనం మాలిక్యులర్ డాకింగ్ అధ్యయనాలు' అనే అంశంపై ప్రొఫెసర్ వి గిరిజా శాస్త్రి పర్యవేక్షణలో ఆమె పరిశోధన చేశారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ రాజశేఖర్ చేత ఈ పట్టాను గురువారం అందుకున్నారు. ఈ విషయాన్ని కేజీఆర్‌ఎల్ ఫార్మసీ కళాశాల డైరెక్టర్ డా. కవల నాగేశ్వరరావు, ప్రిన్సిపాల్ డా. డి. రాఘవ తెలిపారు.