భీమవరంలో గ్రామ దేవత శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి చలుమోలు సేవ, పొలిమేర జాతర మహోత్సవాన్ని నున్న అంజిబాబు, లక్ష్మి దంపతుల ఆధ్వర్యంలో వారి స్వగృహంలో ఘనంగా నిర్వహించారు. ఈ పూజ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి ముళ్లపూడి రేణుక పాల్గొన్నారు. ఆసాదుల గరగ నృత్యాలు అందరిని అలరించాయి. కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, ఆదిలక్ష్మి, పార్థసారథి, భగవాన్, మహేష్, హరికృష్ణ, వర్మ, సుబ్రహ్మణ్యం, అల్లు శ్రీనివాస్, హరికృష్ణ, బలరాం, లక్ష్మి కూడా పాల్గొన్నారు.