భీమవరం హౌసింగ్ బోర్డ్ పార్క్‌ను ప్రారంభించిన మంత్రి

378చూసినవారు
భీమవరం హౌసింగ్ బోర్డ్ పార్క్‌ను ప్రారంభించిన మంత్రి
భీమవరం హౌసింగ్ బోర్డ్ కాలనీలోని 9వ వార్డులో నిర్మించిన పార్క్‌ను జిల్లా ఇన్చార్జి మంత్రి గొట్టిపాటి రవికుమార్ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం ప్రతి పట్టణాన్ని అభివృద్ధి వైపు తీసుకెళ్లడంలో కృషి చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, కలెక్టర్ చదలవాడ నాగరాణి, జిల్లా టిడిపి అధ్యక్షులు రామరాజుతో పాటు పలువురు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్