పశ్చిమగోదావరి జిల్లాలో ఇన్‌ఛార్జ్ మంత్రి రవికుమార్ రెండు రోజుల పాటు పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా, శనివారం ఉదయం 9 గంటలకు మున్సిపల్ కాంప్లెక్స్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. అనంతరం, ఉదయం 9:30 గంటలకు 9వ వార్డు హౌసింగ్ బోర్డు కాలనీలో నిర్వహించే పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో మంత్రి పాల్గొంటారు.