భీమవరంలో ఐదు చోట్ల నమో సేవా గాథ నాటక ప్రదర్శన

3చూసినవారు
భీమవరంలో ఐదు చోట్ల నమో సేవా గాథ నాటక ప్రదర్శన
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాసేవ, సుపరిపాలన, సంక్షేమ పథకాలను కళా రూపంలో వివరించే నమో సేవా గాథ నాటకాన్ని పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో బీజేపీ ఆధ్వర్యంలో మంగళవారం ప్రదర్శించారు. సేవా సంకల్ప అభియాన్ కార్యక్రమంలో భాగంగా తహసీల్దార్ కార్యాలయం, ప్రకాశం చౌక్, నటరాజ్ థియేటర్, అడ్డ వంతెన, చిన అమిరం గ్రామాల్లో కళాకారులు ఈ నాటకాన్ని ప్రదర్శించి, కేంద్ర ప్రభుత్వ విజయాలను ప్రజలకు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి బిజెపి కార్యక్రమ ఇన్ ఛార్జ్ జి పుల్లజీ, పట్టణ అధ్యక్షులు వబిలిశెట్టి ప్రసాద్ రావు, అడబాల శివ, కోమటి రవి కుమార్ హాజరయ్యారు.

సంబంధిత పోస్ట్