ప. గో. జిల్లా కలెక్టర్ స్ట్రాంగ్ వార్నింగ్

1174చూసినవారు
ప. గో. జిల్లా కలెక్టర్ స్ట్రాంగ్ వార్నింగ్
పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి, గర్భస్థ శిశు లింగ నిర్ధారణ పరీక్షలను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. భీమవరం కలెక్టరేట్‌లో వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో శనివారం జరిగిన సమీక్షలో, 'గర్భస్థ శిశు లింగ నిర్ధారణ నివారణ చట్టం' అమలు తీరును పరిశీలించారు. ఈ చట్టం అమలులో లోపాలు లేకుండా పర్యవేక్షణ ఉండాలని, నిబంధనలు అతిక్రమిస్తే ఉపేక్షించబోమని ఆమె స్పష్టం చేశారు.