ప్రజా ఫిర్యాదులకు శాశ్వత పరిష్కారం చూపాలి.. కలెక్టర్

763చూసినవారు
ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్), రెవెన్యూ క్లినిక్‌లో ప్రజల నుంచి అందిన ప్రతి ఫిర్యాదును అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి నాణ్యమైన, శాశ్వత పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి, పీజీఆర్‌ఎస్ నోడల్ అధికారి, డ్వామా పీడీ, కేఆర్‌ఆర్ ప్రాజెక్టు అధికారి పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల వినతిపత్రాలను స్వీకరించారు.