భీమవరం మండలం రాయలం గ్రామంలో ఆదివారం పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహించారు. పోలియో రహిత
భారతదేశం లక్ష్యంగా, నిండు జీవితానికి రెండు చుక్కలు అనే నినాదంతో ఈ కార్యక్రమం జరిగింది. టిడిపి రాష్ట్ర యూత్ ఆర్గనైజింగ్ సెక్రటరీ కోళ్ల
నాగబాబు, ఏఎన్ఎం సిబ్బంది, ఆశా వర్కర్స్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ద్వారా పిల్లలకు పోలియో చుక్కలు వేసి వారిని పోలియో బారి నుంచి రక్షించేందుకు చర్యలు చేపట్టారు.