పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో
బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన జనతా వారధి కార్యక్రమంలో పలు సమస్యలపై అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. నిషేధిత జాబితాలో ఉన్న భూములను సమగ్రంగా పునఃపరిశీలించాలని, ఏటిమొండి శివారు ప్రాంతంలోని భూములకు సాగునీరు అందించాలని కోరుతూ సోమవారం జిల్లా కలెక్టర్ నాగరాణికి వినతిపత్రం సమర్పించారు.ఈ కార్యక్రమంలో
బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కలిదిండి వినోద్‌కుమార్ వర్మ, జనతా వారధి కో-కన్వీనర్లు ఇంజేటి వెంకటేశ్వర్లు, గాదిరాజు వెంకటేశ్వరరాజు, తదితర నాయకులు పాల్గొన్నారు.