భీమవరంలో రూ.66 లక్షల మున్సిపల్ పార్క్ ప్రారంభం

255చూసినవారు
భీమవరంలో రూ.66 లక్షల మున్సిపల్ పార్క్ ప్రారంభం
భీమవరం హౌసింగ్ బోర్డు కాలనీలో 'భవ్య భీమవరం' కార్యక్రమంలో భాగంగా రూ.66 లక్షల వ్యయంతో నిర్మించిన మున్సిపల్ పార్కును రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పులపర్తి రామాంజనేయులు, డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామ కృష్ణంరాజు, కలెక్టర్ చదలవాడ నాగరాణి శనివారం ప్రారంభించారు. భీమవరం సుందరీకరణ దిశగా 'భవ్య భీమవరం' పేరుతో పట్టణంలోని ముఖ్య కూడళ్లు, ప్రధాన ప్రాంతాలు, పార్కుల అభివృద్ధి పనులు శరవేగంగా పూర్తయ్యాయని మంత్రి రవికుమార్ తెలిపారు.

సంబంధిత పోస్ట్