భీమవరం మండలంలోని తాడేరు గ్రామంలో ఆదివారం తెల్లవారుజామున అనంతవాణి అనే సాఫ్ట్‌వేర్ ఉద్యోగినిని తాడేపల్లి శ్యామ్ అనే ఆటో డ్రైవర్ కత్తితో పొడిచి హత్య చేశాడు. వీరిద్దరూ కొంతకాలంగా సహజీవనం చేస్తున్నట్లు సమాచారం. ఆసుపత్రికి తరలిస్తుండగా ఆమె మృతి చెందింది. రూరల్ సీఐ జగదీశ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.