తణుకు ఆర్టీసీ డిపో మేనేజర్ సప్పా గిరిధర్ కుమార్ పగో జిల్లా ఇన్ఛార్జ్ ప్రజా రవాణాధికారిగా పదోన్నతి పొందారు. ఆయన భీమవరం ప్రజా రవాణా అధికారి ముఖ్య కార్యాలయంలో (డి. పి. టివో) బాధ్యతలు స్వీకరించారు. గతంలో భీమవరం డిపో మేనేజర్‌గా పనిచేసి, ఆ తర్వాత తణుకు డిపో మేనేజర్‌గా వెళ్లారు. తణుకు డిపో ఇంచార్జ్ డిఎం గా తాడేపల్లిగూడెం డిపో అసిస్టెంట్ మేనేజర్ ఏడీఎల్ సుధారాణి నియమితులయ్యారు.