భీమవరంలో టీడీపీ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు

79చూసినవారు
భీమవరంలో టీడీపీ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు
తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా, 44 సంవత్సరాలుగా పార్టీకి వెన్నుదన్నుగా నిలిచిన కార్యకర్తలకు పార్టీ రాష్ట్ర పొలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి శుభాకాంక్షలు తెలిపారు. ఆదివారం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో 31, 21, 27, 28, 4, 5, 6, 7 వార్డులలో టీడీపీ జెండాను ఆవిష్కరించారు. పేద, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీ, తొమ్మిది నెలల్లోనే అధికారంలోకి వచ్చి చరిత్ర సృష్టించిందని ఆమె అన్నారు.

సంబంధిత పోస్ట్