తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శనివారం భీమవరం మండలం నరసింహపురం, తాడేరు, వెంప, శ్రీరాంపురం, గొల్లవాని తిప్ప, గుట్లపాడు గ్రామాలలో టీడీపీ స్థూపాలను ప్రారంభించి, పార్టీ జెండాను ఆవిష్కరించారు. టీడీపీ రాష్ట్ర పొలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి, ఏపీడబ్ల్యూసీఎఫ్‌సీ చైర్‌పర్సన్ పీతల సుజాత మాట్లాడుతూ టీడీపీ ఎన్నో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టి, జాతీయ రాజకీయాల్లో కీలక శక్తిగా ఎదిగి ప్రజల పక్షాన నిలిచిందని తెలిపారు.