భీమవరంలో డయాలసిస్‌తో బాధపడుతూ ఇటీవల భర్తను కోల్పోయిన సివాంగుల లక్ష్మికి, టీడీపీ తెలుగు యువత పట్టణ అధ్యక్షుడు గోలగాని రమేష్, మాజీ కౌన్సిలర్ మైలబత్తుల ఐజాక్ బాబుల ఆధ్వర్యంలో రెండు నెలలకు సరిపడా నిత్యావసర సరుకులు, బియ్యం బస్తాను గురువారం అందజేశారు. ఆపదలో ఉన్నవారికి సహాయం చేయడం మానవత్వమని, వారికి అండగా ఉంటామని రమేష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మల్లువలస రాము, నార్ని లక్ష్మీ, కాపా అమర్ బాబు, ఫణి కుమార్ పాల్గొన్నారు.