భీమవరంలో శ్రీపద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి కళ్యాణ బ్రహ్మోత్సవాలు ప్రారంభం

479చూసినవారు
భీమవరంలో శ్రీపద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి కళ్యాణ బ్రహ్మోత్సవాలు ప్రారంభం
భీమవరం హౌసింగ్ బోర్డ్ కాలనీలోని శ్రీపద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో 15వ వార్షిక కళ్యాణ బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని బుధవారం పందిరి రాట ముహూర్తం నిర్వహించారు. ఆలయ అధ్యక్షులు కంతేటి వెంకటరాజు, కమిటీ సభ్యుల సమక్షంలో ఆలయ అర్చకులు పాణింగిపల్లి శ్రీనివాసా చార్యులు పూజ కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం యాగశాల విద్యుత్ దీపాలంకరణ పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి కుక్కల బాల వెంకటరత్నం, చెరుకువాడ రంగసాయి, కెవిఎస్ భాస్కరరావు, అల్లూరి బంగార్రాజు, కడలి వెంకటేశ్వరరావు, మట్టానలిని మోహన్, గొన్నబత్తుల మల్లేశ్వరరావు, సయ్యపరాజు భాస్కర్ రాజు, తటవర్తి శ్రీనివాస్, అల్లు రామారావు, కడలి ఫణి పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్