పుట్టిన శిశువు నుంచి ఐదేళ్లలోపు ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు తప్పనిసరిగా వేయించాలని, పోలియో రహిత సమాజ నిర్మాణానికి అందరూ సహకరించాలని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు పిలుపునిచ్చారు. భీమవరం జిల్లా ప్రభుత్వాసుపత్రిలో పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా చిన్నారులకు ఆయన స్వయంగా పోలియో చుక్కలు వేశారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు పోలియో చుక్కలు వేయించడం మర్చిపోవద్దని, ఇది వారి నిండు జీవితానికి అత్యంత అవసరమని ఆయన అన్నారు.