పోలియో రహిత సమాజనికి పాటుపడాలి.. జేసీ

748చూసినవారు
పోలియో రహిత సమాజనికి పాటుపడాలి.. జేసీ
పోలియో రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించి, 0–5 సంవత్సరాల వయస్సు గల ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పల్స్ పోలియో చుక్కలు వేయించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ టి. రాహుల్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. ప్రజల్లో అవగాహన కల్పించేందుకు శనివారం భీమవరం ప్రకాష్ చౌక్ నుంచి మండల తహసీల్దార్ కార్యాలయం వరకు జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ అవగాహన ర్యాలీని ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జూన్ 28 నుంచి 30వ తేదీ వరకు జిల్లావ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్