భీమవరం ఫిట్ జోన్ జిమ్ లో దాసరి చందు మిత్రబృందం ఆధ్వర్యంలో శనివారం వికలాంగత్వంతో ఉన్న కనుమూరి విజయలక్ష్మికి (కొత్త పూసలమర్రు) వీల్ చైర్ అందజేశారు. విజ్ఞాన వేదిక అధ్యక్షులు అల్లు శ్రీనివాస్ మాట్లాడుతూ చందు యువకులను బాడీ బిల్డింగ్ తో పాటు సమాజ సేవా కార్యక్రమాల్లో భాగస్వాములను చేయటం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో జితేంద్ర, అశోక్, శంకర్, యోనా, విజయ్, రాజేష్, ప్రసాద్, రాజు, క్రాంతి, పవన్, అనికేత్, భార్గవ్, సాయి, చంటి తదితరులు పాల్గొన్నారు.