ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు పి. నాగ మానస శుక్రవారం పశ్చిమగోదావరి జిల్లాను సందర్శించారు. ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం సందర్భంగా బాలల హక్కుల పరిరక్షణ, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన, బాల్య వివాహాల నిరోధం, బాలల సంక్షేమ చర్యలపై సంబంధిత శాఖలకు పలు సూచనలు చేశారు. భీమవరంలో బాల కార్మిక వ్యతిరేక దినోత్సవ అవగాహన ర్యాలీని ఆమె జెండా ఊపి ప్రారంభించారు.