సీతారాంపురంలో వైయస్సార్ విగ్రహం ధ్వంసం.. వైసీపీ శ్రేణుల ఆందోళన

502చూసినవారు
పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం మండలం సీతారాంపురం గ్రామంలో గుర్తు తెలియని వ్యక్తులు మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని ధ్వంసం చేశారు. ఈ ఘటనతో ఆగ్రహించిన వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు విగ్రహం వద్దకు భారీగా చేరుకుని ఆందోళన చేపట్టారు. దుండగులను పట్టుకుని కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ సంఘటనతో గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.