చింతలపూడి మండలం ఫాతిమాపురం సెంటర్‌లో బుధవారం ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ అధికారులు అక్రమ మద్యం అమ్మకాలపై ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో గ్రామానికి చెందిన నాగేంద్రబాబుని అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి 10 క్వార్టర్ మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు.