జంగారెడ్డిగూడెం మండలం వేగవరం బీసీ కాలనీ వద్ద ఆదివారం రాత్రి కర్రలతో వెళ్తున్న లారీ విద్యుత్ స్తంభాలను ఢీకొనడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో 4 స్తంభాలు, ఒక ట్రాన్స్ఫారం ధ్వంసమయ్యాయి. అధికారులు వెంటనే స్పందించి, జేసీబీ సాయంతో స్తంభాలను తొలగించి, విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో సుమారు లక్ష రూపాయల నష్టం వాటిల్లింది.