జంగారెడ్డిగూడెం మార్కండేయపురంలో అన్నం ముద్ద గొంతులో అడ్డుపడి రెండేళ్ల జెస్సీ దీవన అనే బాలిక మృతి చెందింది. మధ్యాహ్నం తండ్రి ఆంజనేయకుమార్ బాలికకు అన్నం తినిపిస్తుండగా ఈ విషాదం చోటుచేసుకుంది. వెంటనే బాలికను ఏరియా ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. తల్లి, నాన్నమ్మ పట్టణంలో పనిమీద వెళ్లిన సమయంలో ఈ సంఘటన జరిగింది.