ఏలూరు జిల్లా చింతలపూడి మండలం ఫాతిమాపురం అడ్డరోడ్డు సమీపంలో శనివారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురుగా వెళ్తున్న కారును వెనుక నుండి ద్విచక్ర వాహనం ఢీకొట్టడంతో మహేష్ అనే యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు అతన్ని చికిత్స కోసం చింతలపూడి ఏరియా ఆసుపత్రికి తరలించారు.