ఒక మహిళకు జరిగిన అన్యాయంపై న్యాయ పోరాటం చేస్తున్న రాష్ట్ర MRPS వర్కింగ్ ప్రెసిడెంట్ సోదరుడు టీం రమేష్‌ను దారుణంగా చంపడం కిరాతకమైన చర్య అని తెలుగు రాష్ట్రాల ఎమ్మార్పీఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి పొలిమేర హరికృష్ణ అన్నారు. ఆదివారం చింతలపూడిలో ఆయన మాట్లాడుతూ, హత్యకు పాల్పడిన దుండగులను కఠినంగా శిక్షించాలని, ఈ దారుణ హత్యను ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు.