చింతలపూడి: ఇద్దరు నాటు సారా విక్రేతలు అరెస్ట్

296చూసినవారు
చింతలపూడి: ఇద్దరు నాటు సారా విక్రేతలు అరెస్ట్
చింతలపూడి మండలం ప్రగడవరం గ్రామంలో బుధవారం ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి రెండు లీటర్ల నాటు సారాను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిపై కేసులు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనతో గ్రామంలో కలకలం రేగింది.

సంబంధిత పోస్ట్