నారాయణపురంలో ఇంట్లో చోరీ, 6 కాసుల బంగారం అపహరణ

1046చూసినవారు
నారాయణపురంలో ఇంట్లో చోరీ, 6 కాసుల బంగారం అపహరణ
కామవరపుకోట మండలం ఉప్పలపాడు పంచాయతీ నారాయణపురంలో తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ జరిగింది. ఈనెల 25న కుటుంబ సభ్యులతో కలిసి ధర్మాజీగూడెం వెళ్లిన బాధితులు 27న తిరిగి వచ్చి చూడగా, గేటు, ప్రధాన ద్వారం తాళాలు పగులగొట్టి బీరువాలోని 6 కాసుల బంగారు ఆభరణాలు, 25 గ్రాముల వెండి, నగదు అపహరణకు గురైనట్లు గుర్తించారు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

సంబంధిత పోస్ట్