ప్రజల మధ్యలో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం పోరాటం చేస్తానని చింతలపూడి జడ్పిటిసి సభ్యురాలు నీరజా తెలిపారు. బుధవారం మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలిసిన అనంతరం ఆమె మాట్లాడారు. జగనన్న సహాయ సహకారాలతో జానకీ రెడ్డి అండదండలతో జడ్పిటిసి గా ఐదేళ్లపాటు బాధ్యతలు నిర్వహించానని నా పదవీకాలం పూర్తి అయినప్పటికీ జగనన్నను స్ఫూర్తిగా తీసుకొని ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఉద్యమిస్తామన్నారు.