జంగారెడ్డిగూడెం మండలం తాడువాయిలోని శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి వారి ఆలయంలో ఈనెల 15వ తేదీ నుంచి మహాశివరాత్రి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ ఉత్సవాల సందర్భంగా ఏర్పాట్లను ఏఎస్పీ సుస్మితా రామనాథన్, సీఐ సుభాశ్, ఎస్ఐ ప్రసాద్ పరిశీలించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా క్యూలైన్ల ఏర్పాటుపై వారు సూచనలు అందించారు.