జంగారెడ్డిగూడెం: అనుమానాస్పద స్థితిలో ఒకరి మృతి

4చూసినవారు
జంగారెడ్డిగూడెం: అనుమానాస్పద స్థితిలో ఒకరి మృతి
శుక్రవారం జంగారెడ్డిగూడెం పట్టణంలో గాది సింగారయ్య (40) అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. గురువారం రాత్రి ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాని సింగారయ్య, శుక్రవారం ఉదయం స్థానిక పశువైద్యశాల సమీపంలోని మురుగు కాలువలో పడి మృతిచెంది ఉండటాన్ని స్థానికులు గుర్తించారు. మృతుడి సోదరి వరలక్ష్మి ఫిర్యాదు మేరకు పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎస్సై వీరప్రసాద్ ఈ వివరాలను వెల్లడించారు.

సంబంధిత పోస్ట్