జంగారెడ్డిగూడెంలో బుధవారం జనసేన పార్టీలో చేరికల సందర్భంగా ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా చింతలపూడ నియోజకవర్గ ఇన్‌ఛార్జి మేక ఈశ్వరయ్య మాట్లాడుతూ, పట్టణంలో వైసీపీ నాయకులు హోటల్, చెప్పుల దుకాణం, కార్ల రిపేర్ షాప్ వంటి వ్యాపారాలు చేస్తున్నారని ఆరోపించారు. పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉండాలని ఆయన కార్యకర్తలకు సూచించారు.